Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
post

పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి.

Sathya Shodhana

సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి– కొత్తగూడెం శాసనసభసభ్యులు కునంనేని సాంబశివరావు.

పాల్వంచ: భారత్ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకి ఆదర్శమని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణ పరిధిలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేసిన పలు మండపాలను సోమవారం సందర్శించి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కునంనేని మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ, పాటిస్తూ పండుగలు, ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకొని మానవ సంబంధాలను మెరుగుపర్చాలన్నారు. ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. ప్రజాస్వామ్య భారత దేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతంతో పండుగలు జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల రాగద్వేశాలకు దూరంగా ఉంటారని తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. ఉత్సవ కమిటీలు భారీ మొత్తాన్ని వెచ్చించి ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం సాంప్రదాయమని, ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించి పలువురికి ఆదర్శంగా నిలవాలని, పోలీసు, రెవిన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాలకు హాజరైన కూనంనేని నీ కమిటి సభ్యులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, కంచర్ల జమాలయ్య, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, గొర్లె అన్నపూర్ణ, నామ కీర్తి, నూనావత్ శ్యామల, నాయకులు మన్యం వెంకన, శనగారపు శ్రీనివాస్, MD యూసఫ్, కోరే కృష్ణ, జకరయ్య, ఆలపాటి ప్రసాద్, నామ పండు, నవీన్, గొర్లె నరేష్, కాకటి రవీందర్, ASN వెంకటేశ్వర్లు, అంబడిపూడి నరేంద్ర, వెంకటేష్, పృథ్వీ, లావుడ్య చందూలాల్, అల్లి వెంకటేశ్వర్లు, sk లాల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

The Sathya Shodhana Sanchalana Vara Pathrika is now on WhatsApp. Follow our channel for sharp analysis and opinions on the latest developments.

Try Prime AI Trading for CFD Prizes

You Could Earn A Second Income With Emaar Malls

Start Forex Trading Get 100% Welcome Bonus

Latest

Related Reads